మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అవుతోంది. ఈ సినిమా చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగానే బుచ్చి సినిమా ఆలస్యం అయ్యిందనే విషయం తెలిసిందే. శంకర్ ఎప్పుడు షూటింగ్ ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు.
కాగా శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్టు కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపాడు. చరణ్ కు సంబంధించి కేవలం 10రోజుల షూటింగ్ మాత్రమే ఉందని తెలుస్తోంది. దీంతో చరణ్ శంకర్ సినిమాకు బైబై చెప్పేసి బుచ్చి బాబు సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలోపు రామ్ చరణ్ గెడ్డం, మీసం పెంచే పనిలో ఉన్నారు. అనుకున్న గెటప్ వస్తే షూటింగ్ స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు రెడీ గా ఉన్నాడు.
ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఇండస్ట్రీలో ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ ని ఫిక్స్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టుగా వినిపిస్తుంది. అయితే దీని గురించి చిత్ర బృందం నుంచి ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోస్తిస్తున్న సంగతి తెలిసిందే.