స్టాఫ్‌ తో చరణ్‌ , ఉపాసన క్రిస్మస్‌ వేడుకలు!

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో సందడి వాతావరణం ఏర్పడింది. ఇక క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రిటీలు సైతం ఎంతో గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకుంటున్నారు.

చరణ్, ఆయన భార్య ఉపాసన క్రిస్మస్ పండుగను సమ్‌థింగ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ స్టాఫ్‌తో వారు ఈసారి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. తమకు ఎప్పుడు ఏం కావాలో దగ్గరుండి చూసుకునే స్టాఫ్‌కు ఇలా క్రిస్మస్ ట్రీట్ ఇవ్వడంతో వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

ఇక దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ గా మారాయి. తమ స్టాఫ్‌ను కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న చరణ్-ఉపాసనల పై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories