చరణ్ 16” లోకి మున్నా భయ్యా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  తాజాగా నటించిన మోస్ట్‌ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. మరి భారీ హైప్ ఉన్న ఈ సినిమా తర్వాత చరణ్ నుంచి మరో పెద్ద ప్రాజెక్టు సిద్దంగా ఉంది.

చెర్రీ చేసే సినిమాలలో ముందుగా డైరెక్టర్‌ బుచ్చిబాబు సానాతో చేయనున్న సినిమా కూడా ఓ మూవీ ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఓ సాలిడ్‌ అప్డేట్ ఇచ్చింది. దర్శకుడు తనకి ఎంతో ఇష్టమైన ఎడిషన్ అంటూ దీనిని ఇపుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి తాజ గానే ఈ సినిమాలో మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ సాలిడ్ నటుడు దివ్యెందు శర్మ ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. మరి తనపై ఇపుడు మేకర్స్ అదిరే పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు.

తన లుక్ ని కంప్లీట్ గా మాస్ లెవెల్లో రివీల్ చేస్తూ ఇచ్చిన పోస్టర్ ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ కి ఎగ్జైట్మెంట్ ని కలిగిస్తుంది. మరి తాను ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తాడో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా కలిసి నిర్మిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.   

Related Posts

Comments

spot_img

Recent Stories