బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన విద్యాబాలన్ సినిమాల గురించి, నటన మీద తన అభిప్రాయాలను పంచుకుంది. సినిమాల రంగం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ మార్పులను అందరూ అంగీకరించాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాల ప్రకారం తగిన మార్పులు చేయడం చాలా అవసరం. అలాంటి మార్చులతోనే వారు ఎక్కువ కాలం ప్రేక్షకుల ముందుంటారు, లేకపోతే అవుట్ అయ్యిపోతారు అని విద్యాబాలన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె రజనీకాంత్‌తో కలిసి నటించాలనే వార్తలు వినిపిస్తున్నాయి.
తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పేటప్పుడు, చిన్నప్పటినుండి ఆమె అలంకరణలకు భిన్నంగా ఉంటుందని, ఆ అలవాటు దూరం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని పేర్కొంది. సినిమాలు తన జీవితం మార్చిన ప్రధాన కారణమన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా నటించడం వల్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది.