చంద్రన్న బర్త్‌డే గిఫ్ట్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయుల ఎదరుచూపులకు భరతవాక్యం పలుకుతూ.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఆదివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు పుట్టినరోజు కానుకగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అయింది. ఈ మెగా డీఎస్సీ ద్వారా ఏకంగా 16347 టీచరు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. స్పెషల్ కేటగిరీ డీఎస్సీ పోస్టులకు ఇది అదనం. చారిత్రాత్మకమైన రీతిలో.. దరఖాస్తుకు గడువులు, పరీక్షల తేదీలు ప్రకటించడం మాత్రమే కాదు. మెరిట్ జాబితా ప్రకటించే రోజుతో సహా చాలా వివరంగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఏప్రిల్ 20 నుంచి మే 15 లోగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలి. 20 నుంచి మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. 30నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత.. రెండోరోజున ప్రాథమికంగా కీ విడుదల అవుతుంది. ఏడురోజుల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మరో ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏడు రోజులకు మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. మొత్తానికి జులై మొదటి వారానికెల్లా మెరిట్ జాబితాలు వచ్చేసే అవకాశం ఉంది.
ఈ విద్యాసంవత్సరం మొదలయ్యే సమయంలోనే కొత్త టీచర్ల నియామకాలు కూడా పూర్తి చేస్తాం అని చంద్రబాబునాయుడు గతంలో పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. డీఎస్సీకి సంబంధించిన ఫైలు మీద కూడా తొలి సంతకాలు పెట్టినప్పటికీ.. రకరకాల సాంకేతిక కారణాలు, ఎన్నికల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు చంద్రబాబునాయుడు 75వ పుట్టినరోజు నాడు విడుదల అయింది. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ జులై మొదటి వారానికెల్లా మెరిట్ జాబితాలు విడుదల చేయబోతోంది. ఆ నెలాఖరుకెల్లా నియామకాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ టీచర్లను మోసం చేశారు. చివరి ఎన్నికల సంవత్సరంలో డీఎస్సీ అంటూ డ్రామా చేశారు. అయిదేళ్లపాటు డీఎస్సీ రాకపోవడం వల్ల.. కొందరికరి ఏజీ బార్ అయిపోయే ప్రమాదం ఉంటుంది గనుక.. చంద్రబాబునాయుడు సర్కారు వారిని దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిని సడలించింది కూడా. మొత్తానికి చెప్పినట్టే 16వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తోంది. నోటిఫికేషన్ రావడం పట్ల నిరుద్యోగ టీచర్ల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories