చంద్రబాబు ద్విముఖ వ్యూహం.. ఫుల్ కాంట్రాస్ట్!

చంద్రబాబునాయుడు ఇప్పుడు తన పార్టీ నాయకులందరికీ ద్విముఖ వ్యూహ్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఏకకాలంలో రెండు పనులు జరగాలని ప్రబోధిస్తున్నారు. ఇంతకూ ఏమిటా రెండు పనులు? కొన్ని నోర్లు తెరచుకోవాలి.. కొన్ని నోర్లు మూతపడాలి! ఎవరి నోర్లు తెరచుకోవాలి.. ఎవరి నోర్లు మూత పడాలి! ఈ విషయంలో చంద్రబా నాయుడు చేస్తున్న దిశానిర్దేశమే.. ప్రభుత్వానికి శ్రీరామరక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. లేకపోతే విపక్షం కుట్రల్లో ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం కూడా ఉంటుంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, కూటమి సర్కారు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్ధంగా అడ్డుకోవడానికి ప్రతి నాయకుడు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రభుత్వం తమ పనితీరును మెరుగుపరచుకొంటున్న కొద్దీ.. కూటమి సర్కారు తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ పోతున్న కొద్దీ.. కూటమి పార్టీల నాయకులకు మరింతగా పెరిగేలా కనిపిస్తోంది.
ఎందుకంటే విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉంది. వారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు.. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వక్రీకరణ భాష్యాలు చెబుతూ ఉంటారు. సత్యాలను మరుగునపెడతారు. అబద్ధాలను ప్రచారంలో పెడతారు. ప్రజలను  భయపెడతారు.. అలా చెలరేగిపోతుంటారు. అందుకే చంద్రబాబునాయుడు తమ కూటమి పార్టీల నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. తాము మంచి పనిని చేస్తూ.. దానిని మోసంగా అభివర్ణించే కుట్రదారులకు సమాధానం చెప్పుకుంటూ బతకడం చాలా కష్టం. కానీ.. ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రత్యేకించి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ లో భయం పెరిగింది. ఆందోళనలో గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తే.. తమకు రాజకీయంగా సమాధి తప్పదని భయపడుతున్నారు. ఈ  భయం కారణంగానే.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబునాయుడు అనివార్యమైన పరిస్థితుల్లో తన పార్టీ శ్రేణులకు ఇలాంటి హితోపదేశం చేయాల్సి వస్తోంది. పార్టీల శ్రేణులందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకుని.. ఎంతగా ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రచారం చేయాలి. ప్రభుత్వం చేస్తున్నకృషిని ప్రజలు గుర్తించడం జరుగుతుంది. అదే సమయంలో తప్పుడు ప్రచారాలు సాగించే.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాల నోర్లకు తాళాలు పడే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories