చంద్రబాబు ప్రమాణం ముహూర్తం మార్పు ఎందుకంటే..?

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేయడానికి  నిర్ణయించిన ముహూర్తాన్ని మార్చనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే ఒక్కరోజు కూడా కనీసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో అయినా జగన్మోహన్ రెడ్డిని కొరసాగనివ్వకుండా 5వ తేదీనే ప్రమాణం చేసేయాలనా పార్టీ వర్గాలు చాలా మంది భావించారు. ఆరోజు చతుర్దశి గనుక మంచిరోజే అని కూడా అన్నారు. కానీ.. చంద్రబాబునాయుడు 9 వ తదియనాడు ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ముహూర్తం మారుతోంది. 12వ తేదీన ప్రమాణం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని పదవికి రాజీనామా కూడా సమర్పించిన నరేంద్రమోడీ.. తిరిగి ఆ పదవిని చేపట్టడానికి 9వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి కూడా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులుగా ఈ ఇద్దరూ తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. అదేరోజు మళ్లీ అమరావతిలో ప్రమాణస్వీకారం నిర్వహించడం సాధ్యం కాదు గనుక.. ఆ తర్వాత మరొకరోజును ఎంచుకునే ప్రయత్నంలో 12వ తేదీన ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని చాలా ఘనంగా, ఆర్భాటంగా నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా సహా కూటమి భాగస్వామి పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. వారందరికీ సౌకర్యంగా ఉండడం కోసం ఘనంగా ఏర్పాట్లు చేయడం కోసం 9 తర్వాత రెండురోజులు వ్యవధి ఉండేలా 12న నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories