చంద్రబాబు రెండో సంతకం : జగన్ దోపిడీకి చెక్!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు ఒక ఆటంబాంబునే ప్రయోగించారు. ఆయన ప్రకటించిన హామీ దెబ్బకు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో భూకంపం రాబోతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రకటించిన కొన్ని పథకాలు ఇప్పటికే వైసీపీ ఓటు బ్యాంకు వర్గాలను కూడా బీభత్సంగా ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడితేనే తమకు ఎక్కువ లాభం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేద గొప్ప తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఒకటే రకమైన ఇబ్బందికి గురి చేస్తున్న జగన్ ప్రభుత్వపు నిర్ణయాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒకటి. తాను అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ఫైలు మీద మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానని చాలా గట్టి హామీ ఇచ్చారు.

పేదల పొలాలను వారికి తెలియకుండానే కాజేసి, వారికి భూమి మీద ఎలాంటి హక్కు లేకుండా చేసే దొంగ మార్గాలు జగన్ సర్కారు తీసుకువచ్చిన చట్టంలో ఉన్నాయి.  మీ ఆస్తుల మీద హక్కులు ఎవరి పేరిటనో మీకు తెలియకుండానే దఖలు పడిపోతాయి. మీరు ఆస్తి మనదే కదా.. పత్రాలు మన బీరువాలో ఉన్నాయి కదా అనుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఓ ఏడాది తర్వాత హఠాత్తుగా ఒకడుయ మీ ఆస్తిలోకి ప్రవేశించి.. ఇది నాది అంటాడు. అప్పుడిక మీరు చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ ఆస్తి ఏడాది కిందటే వాడి పేరు మీదకు మారిపోయి ఉంటుంది. ఆస్తి పేరు మారిన కొన్ని నెలల వ్యవధిలోగా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అధికారి వద్దకు వెళ్లకపోతే.. ఇక మీ హక్కును కోల్పోయినట్టే.. అలాంటి అపభ్రంశపు అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. భూకబ్జాదారులకు ఇది పెద్ద వరం అని అందరూ తొలినుంచి విమర్శిస్తున్నారు.

వైసీపీ నాయకులు మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టం అని, తమ ప్రభుత్వం చేసినది కాదని.. నానా కారుకూతలు కూస్తున్నారు. ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చట్టం లోని దుర్మార్గపు కుట్రలను అర్థం చేసుకున్న ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. కాగా.. చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి రాగానే.. రెండో సంతకం ఈ చట్టం రద్దు ఫైలు మీదనే పెడతాననడం రాష్ర ప్రజలకు పెద్ద ఊరటగా కనిపిస్తోంది. ఇది వైసీపీ సర్కారు మీద మరొక బ్రహ్మాస్త్రం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories