చంద్రబాబు సంధించిన సరికొత్త బ్రహ్మాస్త్రం!

ఏపీలోని ప్రజల మీద ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఏ దందా ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భ్రష్టుపట్టిపోతున్నదో.. దానికి చంద్రబాబు విరుగుడును ప్రకటించారు. ఏ దందా ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కూడా కోట్లు వెనకేస్తున్నారా.. అలాంటి దందాలకు సమూలంగా చెక్ పెట్టే హామీని చంద్రబాబునాయుడు ప్రజలకు అందించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే.. మళ్లీ ఉచితంగా ఇసుక పంపిణీ ఉంటుందని ఆయన గోదావరి జిల్లాల్లో జరిగిన ప్రజాగళం సభల్లో ప్రకటించారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1000కు అందిస్తే, వైసీపీ ఐదు వేలు చేసింది. మిగిలిన నాలుగువేలు ఎవరి జేబులోకి వెళుతున్నాయి అని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు.. జగన్ సర్కారు తీసుకువచ్చిన దుర్మార్గమైన ఇసుక విధానం వలన రాష్ట్రంలో వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతిని కూడా చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. చాన్నాళ్ల పాటు అసలు ఇసుక అందుబాటులోనే లేకుండా విక్రయాలను ఆపు చేయించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోవడం, రోజుకూలీ పనులు కూడా లేక వందల మంద కార్మికులు ఆకలి చావులు చావడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తుండే ఉంటాయి. ఆ తర్వాత కొత్త ఇసుక విధానం తీసుకు వచ్చినప్పటినుంచి.. వైసీపీ నాయకుల దోపిడీ మొదలైంది. ఇసుక విక్రయాల్లో  ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కూడా కోట్లకు కోట్ల రూపాయలు దండుకోవడం మొదలెట్టారు. ఇసుక ధర అమాంతం పెరిగిపోవడంతో పాటు, ఇసుక విక్రయాల సమయంలో ఒకటే బిల్లుతో అనేక లోడ్లు ఇసుకను తరలించడం, అసలు బిల్లులే లేకుండా ఇసుక తరలించడం ఆ సొమ్ములంతటినీ విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు కాజేయడం ఒక అలవాటుగా మారింది.

నోట్లరద్దు తరవాతి పరిణామాల్లో.. దేశవ్యాప్తంగా కిళ్లీ బంకు వద్ద కూడా డిజిటల్ మనీ, యూపీఐ పేమెంట్లు వాడుకలోకి రాగా.. దేశంలో ఏపీలోని ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో మాత్రమే డిజిటల్ కరెన్సీ వినియోగం అమల్లోకి రాలేదు. అంటే.. పేమెంట్లు ఎక్కడా అధికారికంగా రికార్డు కాకుండా.. కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకుంటూ విచ్చలవిడి దోపిడీకి పాల్పడ్డారు. పైగా సామాన్యులకు ఇసుక అనేది ఒక అందని పదార్థంలాగా తయారైంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద కామన్ గా ప్రభావం చూపించే అంశాలలో రోడ్లు, ఇసుక వంటివి తప్పకుండా ఉంటాయి. అలాంటిది ఇసుకను తమ ప్రభుత్వం వస్తే ఉచితంగా పంపిణీ చేస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించడం అనేది ఈ ఎన్నికలకు ఓటర్ల మీద బ్రహ్మాస్త్రంగానే పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories