దటీజ్‌ చంద్రబాబు…తొలి పర్యటనలోనే ఎన్నో విశేషాలు!

దటీజ్‌ చంద్రబాబు…తొలి పర్యటనలోనే ఎన్నో విశేషాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది. 
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో పాటు ఆర్థిక సంఘం చైర్మన్ను కూడా కలిసి అందర్ని ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దిల్లీ పర్యటన అంటే కేంద్ర పెద్దల్లో ఒకరిద్దరిని మాత్రమే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణ విషయం.

కానీ, రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు మొదటి పర్యటన  సాగిన తీరు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ, అప్పట్లో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తన పదవీ కాలంలో 29సార్లు దిల్లీకి వెళ్లొచ్చారు. ఆయన ప్రతీ పర్యటన రహస్యమే. 

దిల్లీ ఎందుకు వెళ్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో! ఏ విషయాలు చర్చిస్తున్నారో! ఏ ఒక్కరికీ అంతు తెలిసేది కాదు. పోలవరం నిధుల కోసమంటూ ఆ పార్టీ నేతలు ఎంతగా నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నది నిజం. ప్రజా ధనంతో ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లిన జగన్. రాష్ట్రానికి సాధించిందేమీ లేదన్నది జగమెరిగిన సత్యం. 

జగన్ దిల్లీ పర్యటనల అంతర్యమేమిటని అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్నోసార్లు ప్రశ్నించాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డాయి. విశాఖ పరిశ్రమ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరిగినా, రోజుల తరబడి కార్మికులు ఆందోళనకు దిగినా జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘అదిగో, ఇదిగో’ అంటూ పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేశారు తప్ప కేంద్రాన్ని అడిగిందే లేదు. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి కానీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి ప్రయోజనాలను చేకూర్చే ఈ  అంశాలప గురించి కానీ జగన్ కేంద్రాన్ని ఏనాడు అడగలేదు అనేది వాస్తవం. పైగా ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం కేంద్రం కోరిన స్థలాన్ని అప్పగించడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి అందరికీ తెలిసిందే.

“ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్ను”ని కాపాడ‌టానికి, అక్రమాస్తుల కేసులు నుంచి తప్పించుకోవడానికి జగన్ తన అధికారాన్ని వాడుకున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఆయన ఏనాడైనా దిల్లీ పర్యటన చేసిందే లేదు. ప్రత్యేక హోదా కోసమంటూ 2018లో రాజీనామాల పేరుతో హడావుడి చేసిన ఆ పార్టీ ఎంపీలు అధికారంలోకి వచ్చాక హోదా గురించి ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానపోలేదు అని జనం అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories