చంద్రబాబుకు నిర్మాణరంగం నీరాజనం!

చంద్రబాబు దార్శనికుడు అయిన నాయకుడు అనడానికి ఇది ఒక సరికొత్త ఉదాహరణ. అసలైన అభివృద్ధి అనేది నిర్మాణాత్మక పనులలో  మాత్రమే ఉంటుందని నమ్మే వారికి ఇది మంచి కబురు. ఓటు బ్యాంకును నిర్మించుకోవడానికి ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం తప్ప మరొక పనిచేసి ఎరగని, జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన పరిపాలనను అయిదేళ్లపాటు చూసిన వ్యక్తులకు చంద్రబాబు అసలు అభివృద్ధి అంటే ఏమిటో రుచిచూపిస్తున్నారు. నిర్మాణరంగం చురుగ్గా ఉంటే.. అనేక రకాలుగా అది రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి మీద ప్రతిఫలిస్తుందనే సిద్ధాంతాన్ని ఆయన ఆచరణలో నిరూపిస్తున్నారు. నిర్మాణరంగానికి మేలు చేయడం కోసం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు తాజాగా.. ఇసుకపై సీనరేజీ చార్జీలను కూడా రద్దు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నిర్మాణరంగానికి మరింత ఊపు వస్తుందని అంతా భావిస్తున్నారు. అసలే ఉచిత ఇసుక విధానం ద్వారా మురిసిపోతున్న నిర్మాణ రంగం.. సీనరేజీ చార్జీలు కూడా రద్దు చేయడంతో చంద్రబాబుకు నీరాజనం పట్టే పరిస్థితి. కేవలం పెద్ద పెద్ద బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు మాత్రమే కాదు.. మధ్యతరగతి, దిగువమధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం చాలా పెద్ద వరం అనడంలో సందేహం లేదు.

రోడ్లు ఎలాగైతే అభివృద్ధి సూచికలుగా నిలుస్తాయో.. నిర్మాణ రంగం సమృద్ధిగా ఉండడం కూడా అదే విధంగా అనేక విధాలుగా అభివృద్ధిని ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో శాసిస్తుంది. జగన్మోహన్ రెడ్డి దురాలోచనతో కూడిన నాయకుడు గనుక.. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఈ నిర్మాణ రంగం నుంచి వీలైనంత దండిగా తాను దోచుకోవడానికి పథకం పన్నారు. నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయేలాగా కుట్రలు చేశారు. ఇసుక లభించకుండా ఆపేశారు. కొత్త ఇసుక విధానం తీసుకువస్తానంటూ ఏడాది పాటూ అసలు రాష్ట్రంలో పనులే జరగని వాతావరణం కల్పించారు. దీనివల్ల ఆ రంగం మీద ఆధారపడిన అసంఘటిత రంగ కార్మికుల్లో వందల మంది ఆకలిచావులకు గురయ్యారు. వారి బతుకు సర్వనాశనం అయ్యాయి. ఏడాది తర్వాత జగన్ తెచ్చిన విధానం కేవలం.. పార్టీ వారు దోచుకోవడానికి మాత్రమే ఉద్దేశించినట్టుగా తయారైంది. అయిన వారికి ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టులు ఇచ్చి అనుమతులతో నిమిత్తం లేకుండా అక్రమ తవ్వకాలు, విక్రయాలు సాగించారు. డిజిటల్ కొనుగోళ్లు జరగనివ్వకుండా దోపిడీకి రాచమార్గంగా మార్చారు. కేవలం ఇసుక వ్యాపారంలోనే నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలను పార్టీ వారు ఎదుర్కొంటున్నారు.

జగన్ పాలనలో అలా కుదేలైన నిర్మాణ రంగానికి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం ద్వారా ఊపిరిపోశారనే చెప్పాలి. సీనరేజీ, పంచాయతీలకు జమ అయ్యే పన్నులు తప్ప మరేమీ చెల్లించాల్సిన అవసరం లేని విధానం తెచ్చారు. దాని మీద కూడా జగన్ విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే తాజాగా సీనరేజీ చార్జీలు కూడా రద్దు చేయడంతో జనం హర్షిస్తున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో నదులు, వాగుల్లో ఎవరైనా ఎంత ఇసుక అయినా తీసుకువెళ్లవచ్చనంటూ కొత్త విధానంలో ప్రకటించారు. ఇది మధ్యతరగతికి గొప్ప మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories