చంద్రబాబు: పరిపాలనలో ప్రక్షాళన 2.0

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పరిపాలన యంత్రాంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసేదిశగా మరో అడుగు వేశారు. రెండు రోజుల కిందట కొందరు ఐఏఎస్ లను బదిలీచేసిన ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్ల మీద దృష్టి పెట్టింది. మొత్తం 14 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ జిల్లాల్లో ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న చాలా మందిని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లుగా ఉంటూ.. ఇన్నాళ్లుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుయాయులుగా, ఆ పార్టీ స్థానిక నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వచ్చారని ముద్రపడ్డారు. అలాంటి వారి ఏరివేత ప్రారంభించారు చంద్రబాబునాయుడు. శృతిమించి జగన్ భక్తులుగా చెలామణీ అయిన వారందరినీ.. జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అటు కలెక్టర్లుగానూ, ఇటు జిల్లా ఎస్పీలుగాను వీరవిధేయులను మాత్రమే నియమించుకున్నారు. పరిపాలన సంగతి ఆయన పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే పనులకు ఎస్ బాస్ అనడం తప్ప.. జిల్లా కలెక్టర్లకు చేయడానికి అప్పట్లో పెద్ద పని కూడా లేకుండాపోయింది. లబ్ధిదారులకు బటన్ నొక్కి డబ్బులు పంచడం తప్ప జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఇసుమంతైనా లేకపోవడం కూడా ఒక కారణం. క్రమంగా కలెక్టర్లు కూడా వైసీపీ కార్యకర్తల్లాగా మారిపోయి.. ప్రజాసమస్యల గురించి తెలుగుదేశం నాయకులు వెళ్లినా స్పందించకుండా పట్టించుకోకుండా తయారయ్యారనే ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల సమయంలో అనేక జిల్లాల కలెక్టర్ల వ్యవహార సరళి మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వీరిలో కొందరిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించడం కూడా జరిగింది.

మొత్తానికి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలివిడతగా జగన్ కు వీరభక్తులైన పెద్దస్థాయి ఐఏఎస్ లపై తొలుత బదిలీల వేటు వేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ల మీద దృష్టి సారించారు. ప్రస్తుతానికి 14 జిల్లాలకు కొత్త కలెక్టర్లు పోస్టు అయ్యారు. ఆ స్థానాల్లో ఉన్న చాలా మందికి పోస్టింగే దక్కలేదు. అయితే పరిపాలనలో చంద్రబాబునాయుడు మార్కు ప్రక్షాళన ఇక్కడితో ముగియలేదని.. ఐఏఎస్ లలోనే మరో విడత బదిలీలు కూడా ఉన్నాయని అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories