ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 10 గంటలకు మోదీతో సమావేశం కానున్నారు.
పోలవరం, అమరావతి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై మోదీకి సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బాబు ఢిల్లీకి వెళ్తుండటంతో రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పునఃనిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీని అగ్రస్థానంలో నిలపెడతామని 164 సీట్లు ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్య అని చంద్రబాబు అన్నారు.