చంద్రబాబుకు నీరాజనం పడుతున్న ప్రజలు!

ఇవాళ జూలై 1! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలు, ప్రభుత్వ పెన్షన్లను పొందుతున్న వారు దాదాపు మూడు నెలలుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచి తమ బాగు కోసం మరింత ఘనమైన చేయూత అందివ్వబోతున్నారనే ఆశతో రాష్ట్రం మూడు నెలలుగా ఎదురుచూసింది. ఆ మంచి రోజు ఇవాళ రానే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న 3000 రూపాయల సంక్షేమ పెన్షన్లను ఒకేసారి 4000 రూపాయలకు పెంచి ప్రజలందరికీ ఇళ్ల వద్దనే అందజేసే ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.  ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్లు ఇస్తాను అని చంద్రబాబు ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. గత మూడు నెలల బకాయిలు 3000 రూపాయలు,  ఇవాల్టి పెన్షన్తో కలిపి లబ్ధిదారులు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఈరోజున అందజేయబోతున్నారు. అందుకే ఇవాళ తాము కోరుకున్న ప్రభుత్వం తమ బాగు కోరే ప్రభుత్వం తమకు మంచి చేస్తున్నదని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు నీరాజనం పడుతున్నారు. 

చంద్రబాబు నాయుడు పెన్షన్ 4000 చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు- ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోరు అని అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. తమ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లలో 500 రూపాయలు పెంచుతానని అది కూడా చివరి రెండు సంవత్సరాలలో ఎన్నికలకు ముందు పెంచుతానని జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు నుంచి, ఒకేసారిగా పెంచిన వెయ్యి రూపాయల మొత్తాన్ని అందజేస్తానని అంటే దానిని జగన్ కొట్టి పారేశారు. జగన్ మాయాపూరితమైన మాటలు ప్రజల మీద పనిచేయలేదు.  వారు చంద్రబాబు నాయుడునే నమ్మారు. ఫలితమే ఇవాళ సంక్షేమ పెన్షన్ల విషయంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్కరికి నాలుగువేలవంతున పెన్షన్ అందబోతోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఈ పెంచిన పెన్షన్లను పొందబోతున్నారు. వికలాంగులకు ఏకంగా 6000 రూపాయలుగా పెన్షన్ పెంచారు చంద్రబాబు నాయుడు. 

కేవలం పెన్షన్ మొత్తాన్ని పెంచడం మాత్రమే కాకుండా లబ్ధిదారులు అందరికీ కూడా ఇళ్ల వద్దనే అందజేసే అద్భుతమైన, స్థిరమైన వ్యవస్థీకృత ఏర్పాటుకు కూడా చంద్రబాబు శ్రీకారం దిద్దుతున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల ద్వారా రెవెన్యూ ఉద్యోగుల ద్వారా మాత్రమే ప్రతి ఇంటికి పెన్షన్ అందబోతున్నది. జగన్మోహన్ రెడ్డి వక్ర పూరిత స్వార్ధ ప్రయోజనాలతో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను మరింత మెరుగైన అవసరాలకు వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఒకటవ తేదీ ఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పూర్తయ్యేలా చూడాలని పురమాయించారు. కొన్నిచోట్ల ఆలస్యమైనా రెండో తేదీకి పూర్తయ్యే అవకాశం ఉంది. పరిపాలనలో ఇంతటి స్థిరత్వాన్ని తీసుకురాగలిగిన సమర్థ నాయకుడు కనుక ప్రజలందరూ ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు సంక్షేమ  పెన్షన్లు కొత్త రూపంలో ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా ఆయన అమలు చేస్తున్న తీరుకు నీరాజనం పడుతున్నారు.

Watch Live:

Related Posts

Comments

spot_img

Recent Stories