అక్కినేని వారింట పెళ్లికి చంద్రబాబుకి ఆహ్వానం!

టాలీవుడ్ లో యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. అయితే సినిమాపై ఫోకస్ చేస్తూనే, ఆయన వ్యక్తిగత జీవితం నుంచి ఓ పెద్ద అప్‌డేట్ బయటకి వచ్చింది. ఇప్పుడే అక్కినేని ఫ్యామిలీ నుంచి అభిమానులకి మరో గుడ్ న్యూస్ అందింది.

ఇకపోతే, ఈ జూన్ 6న అఖిల్ తన జీవితంలో కీలకమైన అడుగు వేయనున్నాడు. అఖిల్, జైనబ్ అనే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇకపోతే నాగార్జున ఈ శుభకార్యానికి పలువురు ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలసిన నాగార్జున, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా కలిసి పిలవడంతో, ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక నటుడిగా నాగార్జున కూడా ఈ మధ్య బిజీగా ఉన్నాడు. త్వరలోనే కూలీ మరియు కుబేర అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకవైపు అఖిల్ పెళ్లి సందడి కొనసాగుతుండగా, మరోవైపు అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుసగా సినిమా అప్‌డేట్లు రావడం అభిమానుల్ని మంచి ఉత్సాహంలో ముంచెత్తుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories