జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికులు అందరూ ఘనంగా జరుపుకునేందుకు రెండు రోజుల ముందే.. చంద్రబాబునాయుడు వారి జీవితాలకు పండగ వాతావరణం ఇచ్చేశారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలను ప్రకటించారు. చేనేత కార్మికులు జీవితంలో ఎప్పటికీ.. చంద్రబాబు చేసిన మేలును తలచుకుంటూ ఉండేలా.. ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. చేనేత వస్త్రాల మీద జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు.
జీ ఎస్టీ రూపంలో కార్మికులకు ఒక్క రూపాయి కూడా భారం పడనివ్వని అద్భుతమైన నిర్ణయం ఇది. రాష్ట్రంలోని కార్మికులకు పడే జీఎస్టీ భారాన్ని పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే కేంద్రానికి చెల్లిస్తుంది. అలాగే చేనేత కార్మికుల సంక్షేమం కోసం.. 5 కోట్ల రూపాయలతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. చేనేత కార్మికులకు ఉచిత కరెంటు హామీని కూడా చంద్రబాబు ప్రకటించారు.
చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇవ్వనున్నట్టు కూడా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ కొత్త వరాలతో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు, ఆ సంతోషం రెండు రోజుల ముందే చేనేత కుటుంబాల్లోకి వచ్చినట్టుగా అయింది.
ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబునాయుడు చేనేత కార్మికులకు వరాలు గుప్పించారు. ఉచిత కరెంటు అందిస్తానని అన్నారు. సూపర్ సిక్స్ లో భాగం కానటువంటి, పేదల జీవితాలను ఆదుకునేటువంటి మంచి హామీల్లో అది కూడా ఒకటి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా.. ఈ చేనేత దినోత్సవానికి ముందుగా.. వారికి ప్రకటించిన హామీ ఉచిత కరెంటుతో పాటు.. మరిన్ని వరాలను ప్రకటించారు చంద్రబాబునాయుడు. చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీ పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే భరించడం అనేది ఆ రంగానికి చాలా పెద్ద ఊతం అవుతుందనడంలో సందేహం లేదు. వీటికి తోడు చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడం కోసం కూడా చేనేత రంగానికి ఎంతో మేలు చేసే నిర్ణయమే.