జగన్ పాపం సరి చేస్తూనే చంద్రబాబు ముద్ర! 

ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను బతిమాలిన జగన్మోహన్ రెడ్డి, అది దక్కిన వెంటనే ఎంతటి విధ్వంసకరమైన పరిపాలనకు శ్రీకారం చుట్టారో ప్రజలందరకూ తెలుసు. ప్రభుత్వ నిర్మాణాలను కూల్చివేయడంతో ప్రారంభించిన జగన్ రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ప్రైవేటు ఆస్తులను కూడా విచ్చలవిడిగా కూలగొట్టడం అనేది ఒక ఉద్యమం లాగా చేస్తూ వెళ్లారో ప్రజలందరూ గమనించారు. ఈ పాపాలు అన్నీ ఒక ఎత్తు అయితే. రివర్స్ టెండరింగ్  పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశ్నార్ధకంగా  మార్చివేయడం అనేది యావత్తు రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహం గా పరిగణించాలి! నామమాత్రంగా కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించామని టముకు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఆ తర్వాత పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించడం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అది కాస్త గాడి తప్పి అధ్వానంగా సాగడంతో.. కాపర్ డ్యాం కొట్టుకుపోవడం కూడా ప్రజలు చూశారు. రివర్స్ టెండర్రింగ్ అంటూ కొన్ని మాయమాటలు చెప్పి.. తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి.. వారికి దోచి పెట్టడమే లక్ష్యంగా జగన్ పనులు సాగించారు. అయితే ఆ పాపాలను చక్కదిద్దే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ రివర్స్ టెండర్రింగ్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలవరం పనులను పాత విధానంలోనే టెండర్లు పిలిచి అప్పగించాలని నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 

ఒకవైపు జగన్ చేసిన పాపాలను చక్కదిద్దుతూనే.. మరొకవైపు రాజకీయ కక్షలు అభివృద్ధి పనుల విషయంలో తనకు ఉండవు అనే ఔదార్యాన్ని చంద్రబాబు నాయుడు నిరూపించుకుంటున్నారు. పోలవరం ఎడమ కాలువ పనులను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు క్యాబినెట్.. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థని కొనసాగించాలని అనుకున్నారు. ప్రతిసారి కాంట్రాక్టర్లను మార్చడం తద్వారా అనుచిత లబ్ధి కోసం ఎగబడడం తమ ప్రభుత్వం హయాంలో ఉండదని చంద్రబాబు నాయుడు నిరూపించినట్లు అయింది. 

అలాగే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ లిక్కర్ వ్యవహారాలతో పాటు ఇసుక వంటి దందాలను కూడా పరిశీలించేలాగా ఏర్పాటు చేసిన సెబ్  (ఎస్ ఈ బి) రద్దుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది చాలా కాలంగా ఆ విభాగానికి చెందిన అధికారులే కోరుకుంటున్న వ్యవహారం కావడం గమనార్హం.

Related Posts

Comments

spot_img

Recent Stories