జగన్‌కు చేతకానిది చేసి చూపిస్తున్న చంద్రబాబు!

ముఖ్యమంత్రిగా ఒక్క చాన్స్ అడిగిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో అయిదేళ్ల పాటు ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిపాలన సాగించడం అనేది ఆయనకు చేతకాలేదు. జగన్ పాలనలో రాష్ట్రంలో రోడ్లన్నీ ఎంతటి దీనస్థితిలో ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. ఆయా రోడ్ల మీద ప్రయాణించే ప్రజలు ప్రతిరోజూ జగన్ ను తిట్టుకుంటూ జీవితాలు సాగించారు. రోడ్ల మీద ఎలాంటి గోతులు ఉండేవంటే.. పొరబాటుగా ఆ రోడ్డులోకి ఎంటరైనా వాహనం గోతిలో పడితే.. ఇక లేచే అవకాశం కూడా లేనంత పెద్ద గోతులుండేవి. జగన్ పట్టించుకోలేదు. కేవలం సంక్షేమం ముసుగులో డబ్బు పంచి ఓటు బ్యాంకు నిర్మాణం ఒక్కటే తన లక్ష్యం అనుకున్నారు.

జగన్ ఎలాంటి అభివృద్ధి పాలన అనేది చేతకాకుండా పోయిందో.. అదే కోణంలో చంద్రబాబునాయుడు తన పరిపాలన సమర్థతను నిరూపించుకుంటున్నారు. ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబునాయుడు.. కొత్త రోడ్ల ప్రతిపాదనలను ప్రస్తుతానికి పక్కన పెట్టి.. పాత రోడ్ల మరమ్మతులను తక్షణం పూర్తిచేయాలని ఆదేశించారు. మొత్తం 7087 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్లకు మరమ్మతులు జరగనున్నాయి.
రోడ్ల గోతులను పూడ్చి మరమ్మతులు చేయించడంలో సరికొత్త టెక్నాలజీలను కూడా వినియోగించాలని చంద్రబాబు ఆదేశించడం విశేషం. రోడ్ల  మరమ్ముతుల కోసం ఆన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేవలం ఆర్ అండ్ బీ అధికారులు మాత్రమే కాదు.. సెంట్రల్ రోడ్ రీసెర్చి ఇన్స్ టిట్యూట్, తిరుపతి ఐఐటీ, ఎసఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులు, రోడ్ల గురించి తెలిసిన నిపుణులైన ఇంజినీర్లు ఉండడాన్ని మనం గమనించాలి. ఇది చంద్రబాబు శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. కొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎక్కువకాలం మన్నే మరమ్మతులను చేపట్టడం గురించి వీరంతా వివిధ రకాలసూచనలు చేశారు.

కొత్త టెక్నాలజీతో మరమ్మతులను పైలట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల చేసి చూడాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం మొత్తం రోడ్ల మరమ్మతులు పూర్తయిన తర్వాతే.. కొత్తరోడ్ల విస్తరణపై దృష్టిపెట్టాలని చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర రోడ్లలో రద్దీ ఎక్కువ ఉన్నవాటిని ఎంపిక చేసి బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) పద్ధతిలో వాటిని అభివృద్ధి చేయడం గురించి కూడా నివేదిక చేయాలని చంద్రబాబు ఆదేశించడం విశేషం. మొత్తానికి జగన్ కు చేతకాని రోడ్ల మరమ్మతు అనేది చంద్రబాబు చేసి చూపుతున్నారు. ప్రజల ప్రయాణాల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories