ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!

అయిదేళ్ల పాటు జగన్ విధ్వంసంసృష్టించి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం అనేది ఆయన ఎదుట ఉన్న తొలి ప్రాధాన్యం. అలాగే.. జగన్ స్మశానంగా మారచేసిన అమరావతి ప్రాంతాన్ని తిరిగి దేవతల రాజధానిగా రూపుదిద్ది తెలుగు ప్రజాలకు కానుకగా అందించాలనే సంకల్పంతో రాత్రింబగళ్లు పనిచేస్తున్నారు. అదే సమయంలో.. ఈ అయిదేళ్ల పదవీకాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందనే హామీ తెలుగు ప్రజలకు ఇచ్చినందుకు.. అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించే పనిలో తలమునకలు అవుతున్నారు. ఇన్ని కార్యభారాలను చంద్రబాబు మరియు ఎన్డీయే కూటమి ప్రభుత్వం నెత్తిన మోస్తుండగా.. ఆయన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలా ప్రభుత్వం పరువుపోయేలా, ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం ఇచ్చేలా వ్యవహరిస్తే ఎలా? అనే చర్చ ఇప్పుడు మొదలవుతోంది. వివాదాలకు కారణమౌతున్న ముగ్గురు ఎమ్మెల్యేల తీరు మీద ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబునాయుడు, తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీ, ప్రభుత్వం పరువు తీసిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న శ్రీకాంత్ అనే కరడుగట్టిన నేరస్తుడు, హత్య కేసులో నిందితుడికి హోం సెక్రటరీ స్వయంగా పెరోల్ ఇవ్వడం ఇప్పుడు చాలా సీరియస్ అంశంగా రాష్ట్రంలో చర్చల్లో ఉంది. గతంలో హత్యకేసులో యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా జైల్లో ఉంటూ పారిపోయిన శ్రీకాంత్ నాలుగున్నరేళ్లకు పైగా బయటే ఉండి.. అతిపెద్ద నేరసామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అనేక నేరాలకు పాల్పడేవాడు. 200 మందితో గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. ఇతను మళ్లీ జైలుకు వెళ్లిన తర్వాత చేసిన దందాలు కూడా తక్కువేం కాదు. జైల్లో ఉంటూనే బయట సెటిల్మెంట్లు చేసేవాడని పేరుంది. గూడూరుకు చెందిన అతను పెరోల్ అడిగితే.. తిరుపతి జిల్లా ఎస్పీ మరియు నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంటు ఇద్దరూ కూడా దానిని తిరస్కరించారు. కానీ.. పూర్వ నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అతనిక పెరోల్ ఇవ్వాల్సిందిగా సిఫారసు చేస్తూ హోంమంత్రికి లేఖలు రాశారు. ఇద్దరు ఐపీఎస్ లు వద్దని చెప్పినా కూడా వారి మాటలను బేఖాతరు చేస్తూ హోం సెక్రటరీ శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చారు.

ఇది వివాదాస్పదం అయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ నేరగాడికి అండగా నిలవడం జిల్లాలో సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైపు ప్రభుత్వం మంచి పాలన అందించడానికి నానా కష్టాలు పడుతుండగా.. కొందరు ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా ప్రవర్తించడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సీరియస్ గా క్లాస్ పీకి, పద్ధతి మార్చుకోకుంటే భవిష్యత్ పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని హెచ్చరించాలని పార్టీలో సీనియర్లకు పురమాయించినట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories