డబుల్ మీనింగ్ తో కార్యకర్తలకు స్ఫూర్తి ఇస్తున్న చంద్రబాబు!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఏపీలో అధికారం లోకి వచ్చిన తరువాత.. తెలంగాణ పార్టీపై కూడా ఆయన ఫోకస్ పెడుతున్నారు. తరచుగా ఇక్కడి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నిర్వహించిన సమావేశంలో.. డబుల్ మీనింగ్ వచ్చే స్ఫూర్తిదాయక మాటలతో చంద్రబాబు కార్యకర్తలకు ప్రేరణ ఇవ్వడం విశేషం.

మబ్బులు చేదించుకుంటూ ముందుకు దూసుకువెళ్లే నాయకత్వం ఇప్పుడు పార్టీకి అవసరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. మబ్బులు చీల్చుకుంటూ ముందుకు వెళ్లడం అంటే.. ఆ మాటలకు రెండు అర్థాలు వస్తాయి. మబ్బులు కమ్మినప్పుడు ఎంత గొప్పడైన మసకబారుతుంది. ఎంతగొప్ప వారికైనా ప్రభావం కనుమరుగు అవుతుంది. ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ తిరిగి పూర్వ వైభవం స్థితికి రావాలనేది మొదటి అర్థం. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభావం ప్రస్తుతం మబ్బులు పట్టి మసకబారి ఉంది. వాటిని చీల్చుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కావాలనేది ఆయన అభిభాషణ!

అలాగే,  ఇదే వాక్యాలకు ఇంకొక అర్థం కూడా ఉంది. మబ్బులు అనేవే ఆకాశంలో ఉంటాయి. వాటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్లడం అంటే.. ఆకాశమే లక్ష్యంగా ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో.. పార్టీని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లే నాయకత్వం కావాలని అర్థం!!

ఒకే వాక్యానికి రెండు రకాల స్ఫూర్తిదాయక అర్థాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు తో ప్రారంభించి.. పార్టీని స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేస్తూ.. నెమ్మదిగా తిరిగి ట్రాక్ మీదికి తీసుకురావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో కార్యకర్తలకు ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పడం మంచిదే అని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా పాత కమిటీలను అన్నిటినీ రద్దు చేసి, అడ్ హాక్ కమిటీలు వేశారు. మొత్తానికి చంద్రబాబు తెలంగాణ పార్టీపై కూడా శ్రద్ధ పెడుతుండడం శుభపరిణామం అని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories