సైకో’కు ప్రమోషన్ ఇచ్చిన చంద్రబాబు!

జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమైన సమయంలో ఆయన వ్యవహార సరళిని దెప్పిపొడుస్తూ సైకోగా అభివరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రమోషన్ కూడా ఇచ్చారు. సరికొత్త పదాన్ని కనిపెట్టారు. ‘భూతం’, ‘డెవిల్’ అనే పదాలతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వా న్ని ఆయన ఇప్పుడు పేర్కొంటున్నారు. తన దృష్టిలో- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచి, వినాశకారిగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డిని గురించి ప్రస్తావించడానికి చంద్రబాబునాయుడుకు డెవిల్, భూతం అనే పదాలుతప్ప మరొకటి స్ఫురించినట్లుగా లేదు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా యువతరానికి తీరని ద్రోహం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎలాంటి విధ్వంసక పరిపాలన సాగించారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలనిదానికి, తమ అవినీతికి కొమ్ము కాయకపోతే, తాము అడిగిన వాటాలను చెల్లించుకోకపోతే రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోవాల్సిందిగా అనేక భారీ పరిశ్రమలను సైతం బెదిరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖాతాలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోగా పేర్కొంటూ అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోయారు.

సైకోపాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? అంటూ చంద్రబాబు సూటిగా బాణాలను సంధించారు.
ఆ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. చంద్రబాబుకు జనం నీరాజనం పట్టారు. గద్దె ఎక్కిన తర్వాత.. ప్రభుత్వపు ఖాళీ బొక్కసాన్ని గమనించిన తర్వాత.. చంద్రబాబునాయుడుకు జగన్ మీద మరింతగా ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా ఉంది. అందుకే కాబోలు, ఇన్నాళ్లు సైకోగా అభివర్ణించిన జగన్ కు ఆ పదం చాలదని ఆయన ఫిక్సయ్యారు. అందుకే ఇప్పుడు జగన్ పేరుకు బదులుగా డెవిల్, భూతం అంటున్నారు. ఈ రాష్ట్రానికి భూతం పీడ వదిలించానని.. ఇక పరిశ్రమలు రావడానికి సంకోచించాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు పిలుపు ఇస్తున్నారు. జగన్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. చంద్రబాబునాయుడు సృష్టిస్తున్న స్నేహపూర్వక నిజాయితీగల వాతావరణానికి పరిశ్రమల రాక త్వరలోనే ప్రారంభం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories