ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

 ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఇంతకుముందే చర్చించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఈ పథకం కూడా ఉంది. ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు దాటిన.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది.

త్వరలోనే విధివిధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories