చంద్రబాబు.. రెట్టించిన శ్రద్ధ, చిత్తశుద్ధి!

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ముప్పయ్యేళ్లు అవుతోంది. ఆయన రాజకీయ జీవితం వయస్సు దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైమాటే. ఇంతటి సుదీర్ఘ కెరీర్ ఉన్న నాయకుడు మరొకరిలో అయితే కాస్త నిర్లిప్తత, నిర్లక్ష్యం చోటుచేసుకునేవేమో. ప్రజల సమస్యల పట్ల స్పందించే తీరులో.. ఒకింత అలసత్వం, ఇతరులను పురమాయించి తాను పర్యవేక్షణ మాత్రం చేద్దాం అనుకునే నైజం ప్రవేశించేవేమో! కానీ ఆయన చంద్రబాబునాయుడు. తన జీవితం ప్రజల కోసమే అంకితం అని నమ్మే వ్యక్తి. ఆయనలోని చిత్తశుద్ధి, ప్రజల పట్ల శ్రద్ధ రోజురోజుకూ ఇనుమడిస్తున్నాయే గానీ.. పలచబడడం లేదు.
విజయవాడ భారీ వర్షాల ముప్పులో చిక్కుకుంటే చంద్రబాబునాయుడు స్పందించిన తీరు అపూర్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ప్రజల కష్టాల పట్ల ఇంతటి శ్రద్ధతో స్పందించిన ముఖ్యమంత్రి మరొకరు లేనేలేరని ప్రజలు అంటున్నారు.

ఆదివారం అర్ధరాత్రి కూడా విజయవాడ్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు పర్యటించారు. వర్షం తాకిడికి గురై నీటమునిగిన ప్రాంతాల్లో ఆదివారం ఒకసారి బోటులో పర్యటించిన చంద్రబాబునాయుడు.. అర్ధరాత్రి మళ్లీ సింగ్ నగర్ కు బోటులోనే వచ్చారు. అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

సోమవారం తెల్లవారేలోగా పరిస్థితిని మొత్తం చక్కదిద్దుతామని, ఏ ఒక్కరూ ధైర్యం కోల్పోకుండా ఉండాలని చంద్రబాబు వారితో అన్నారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ఫిర్యాదులను చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్ తో నోట్ చేసుకోవడం విశేషం. సోమవారం ఉదయానికెల్లా బోట్లు, హెలికాప్టర్ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రతిఒక్కరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

అసలు వర్షం తాకిడి తీవ్రం అయినప్పటినుంచి చంద్రబాబు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, చేపడుతున్న సహాయక చర్యలు గొప్పగా ఉంటున్నాయి. చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా కలెక్టరు కార్యాలయానికి వచ్చి అక్కడినుంచే సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో అందరినీ పురమాయించి పనులు చేయించే వారినే తప్ప.. స్వయంగా తానే ముందుండి ఇంతగా నడపించే వారిని చూడలేదని జనం అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories