విఘ్నాలను దాటి రైల్వేజోన్ సాకారం చేస్తున్న చంద్ర సర్కార్! 

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు అనేటివి ఒక్కటి కూడా జరగకూడదని కంకణం కట్టుకున్నారో ఏమోగానీ దేనిని పట్టించుకోలేదు. విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత స్థలాల అప్పగింత విషయంలో జాప్యం చేస్తూ వచ్చారు. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని స్థలం తమకు అప్పగిస్తే తక్షణం పనులు మొదలవుతాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు సాక్షిగా పలు సందర్భాలలో ప్రకటించినా కూడా జగన్ సర్కారులో చలనం రాలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటూఉంది. . ముడసరిలోవ స్థలాన్ని రైల్వేకు అప్పగించడానికి అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేస్తోంది. 

చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు సిద్ధంగా ఉండడంతో రైల్వే జోన్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభమవుతాయని ఆశావహ దృక్పథం ప్రజల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం తప్ప మరొక పని ఏది చేయాలనే ధ్యాసే లేకుండా ఐదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన సాగించారని ప్రజలు అంటున్నారు. రైల్వే జోన్ వచ్చినట్లయితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అది ఎంతో కీలకమవుతుందని వేల కొలది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన సాధ్యమవుతుంది అని అందరూ కోరుకుంటున్నప్పటికీ దానిని సాకారం చేసే దిశగా జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర పట్ల కల్లబొల్లి ప్రేమను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆచరణాత్మక దృక్పథంతో అడుగులు వేయలేదు. 

జగన్ సర్కారు చేసిన అనేక తప్పులను సరిదిద్దే క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైల్వే జోన్ విషయంలో కూడా గట్టి ప్రయత్నం చేసింది. ఫలితంగానే ఇప్పుడు స్థలాలను రైల్వే వారికి అప్పగించడం జరుగుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories