సూర్య చంద్రుల కొత్త ప్రాజెక్ట్‌!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర సాలిడ్ హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం “తండేల్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం సక్సెస్ తర్వాత తన నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు తాను చేస్తుండగా ఈ సినిమాలలో కోలీవుడ్ స్టార్ నటుడు సూర్యతో కూడా ఓ సినిమా ఉన్నట్టుగా తెలిపాడు.

అయితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం చందూ మొండేటి సూర్య కోసం ఒక లార్జర్ ధన్ లైఫ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. అలాగే నిర్మాత అల్లు అరవింద్ దగ్గర ఆల్రెడీ సూర్య డేట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories