ఇద్దరు పిల్లలు చాలు అంటున్న చైతూ!

టాలీవుడ్ నటుడు, యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆయన నటి శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ‘ది రానా ద‌గ్గుబాటి టాక్ షోలో’   పాల్గొన్న చైతూ తన సిసిమా కెరీర , ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలో హోస్ట్ రానా.. వెంకీమామలా నలుగురు పిల్లలు కావాలా..? అని ప్రశ్నించగా.. దానికి చైతూ ఒకరిద్దరు చాలు అంటూ బదులిచ్చారు. అలాగే తనకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్ కి తీసుకెళ్తానని.. అమ్మాయి పుడితే తన అభిరుచులను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తాని వివరించారు.

పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉందని. చిన్నప్పుడు పిల్లలుగా తాము ఎంజాయ్ చేసిన ప్రతి క్షణాన్ని కూడా  మళ్ళీ వాళ్ళతో కలిసి ఆస్వాదించాలని ఉందంటూ చైతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్‌ లో  ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల అవుతుంది. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఇందులో సాయి పల్లవి కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బుజ్జి తల్లి’ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories