టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరోల్లో అక్కినేని వారి వారుసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. మరి చైతన్య హీరోగా ఇపుడు రెండు భారీ సినిమాలు చేస్తున్నసంగతి తెలిసిందే. అంతేకాకుండా చైతూ తాజాగానే వివాహా బంధంతో కొత్త జీవితాన్ని కూడా తాను మొదలు పెట్టాడు. అయితే చైతూ నుంచి తెలుగులో బిగ్ స్క్రీన్స్ పై సినిమాతో కూడా ఓటిటిలో కూడా తాను ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.
దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో చేసిన ఇంట్రెస్టింగ్ హారర్ సిరీస్ “దూత”. దీంతో ఓటిటిలో ఎంట్రీ ఇవ్వడంతోనే సూపర్ హిట్ ని కూడా తాను సొంతం చేసుకున్నాడు. అయితే అసలు తన ఓటీటీ డెబ్యూపై తాజాగా రానా టాక్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రకటించాడు.
మెయిన్ గా ఓటిటి విషయంలో సినిమాల తరహాలో బుకింగ్స్, విడుదల, శుక్రవారం టెన్షన్ లు ఉండవు అని అలాగే షూటింగ్ కూడా చాలా సాఫీగా చేసేసాను అని వివరించాడు. సినిమాలు చేస్తున్నపుడు ఓటిటిలో చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు అంటారు కానీ ప్రపంచం ముందుకు పోతుంది.మనం కూడా ముందుకు నడవాలి.
అన్ని ప్లాట్ ఫామ్ లలో అందరూ కలిసి పని చేస్తున్నారు, అదే సినిమాలో విడుదలకి వచ్చే ఫోన్ కాల్స్ కూడా ఉండవు అంటూ ఎప్పుడో వస్తాయ్ అంటూ దూత సిరీస్ చేసినపుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఇంకా సిరీస్ లు చేస్తానని చైతూ ప్రామిస్ చేసాడు.