బన్నీకి పోటీగా చైతూ!

పుష్ప -2  డిసెంబరు 6న విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. ఇక డిసెంబరు లో వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా  ఏడాది సంక్రాంతికి మారింది. ఆ డేట్ లో రావాల్సిన మెగా స్టార్ విశ్వంభర సమ్మర్ కు మారిపోయింది. అలాగే డిసెంబరు లో విడుదల అవుతుంది అనుకున్న నందమూరి బాలకృష్ణ, బాబీ ల సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ విధంగా డిసెంబరు పంచాయితీ ఎటువంటి తర్జన భర్జన లు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

కాగా ఇప్పుడు డిసెంబరులో రిలీజ్ చేయాలనీ చూస్తున్న సినిమాల విషయంలో మరొకసారి తర్జనభర్జనలు మొదలైయ్యాయి. బాలయ్య, చరణ్ తప్పుకోవడంతో ఆ డేట్ కోసం ఓ ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు పోటీ లో నిలిచాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాను మైత్రి సంస్థ నిర్మిస్తోంది.మరొక యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ ను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.

ఇందులో రాబిన్ హుడ్ ను డిసెంబరు 20న రిలీజ్ చేస్తునట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే డేట్ కు నాగ చైతన్య తండేల్ ను కూడా విడుదల చేయాలని గీతా కాంపౌండ్ ఆలోచన లో ఉన్నట్లు సమాచారం. 25న క్రిస్మస్ హాలిడే రావడం, 31న న్యూయార్ పబ్లిక్ హాలిడే కావడమంతో రెండు సినిమాలు ఒకే డేట్ కు రావాలని పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలు వారి కెరీర్ కు చాలా ముఖ్యం. తండేల్ ను చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ రూ. 75 కోట్లతో రూపొందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories