నెల తిరక్కుండానే లక్ష్యం వైపు వడివడిగా.. బాబు అడుగులు!!

చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా సరిగ్గా నెల కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీలు అన్నింటినీ పూర్తి చేయడం గురించి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక కీలక హామీలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధుల కల్పన అనేది చంద్రబాబు గరిష్టంగా శ్రద్ధ పెడుతున్న వ్యవహారాల్లో ఒకటిగా ఉంది.

బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున నైపుణ్య గణన కు సంబంధించిన ఫైల్ మీద కూడా తొలి సంతకం పెట్టిన చంద్రబాబు.. ఉద్యోగాల కల్పన విషయంలో అంతే దూకుడుగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు రావడం, సీఎంతో భేటి కావడం, పరిశ్రమల ఏర్పాటు గురించి మంతనాలు సాగడం అనేది జగన్ పాలన ఐదేళ్లలో  వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినన్ని కూడా జరగలేదు. కానీ చంద్రబాబు ఈ నెలలోనే పెట్రో కారిడార్, ఈవీ వాహన తయారీ వంటి సంస్థల మంతనాలు సాగాయి.

తాజాగా చంద్రబాబు సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఎంత అనుకూలమైనదో వివరించారు. నైపుణ్య గణన ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇస్తామని తెలియజెప్పారు. ఈ ప్రయత్నాలు ఏపీ పారిశ్రామిక పురోగతికి బాటలు వేస్తాయి. ప్రత్యేకించి యువత పురోగతి, ఉద్యోగాల కల్పన విషయంలో చంద్రబాబు శ్రద్ధ ఈ నెల రోజుల్లోనే అనేక విధాలుగా వ్యక్తం అవుతుందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories