నింద వేసే ముందు ఒక్క సాక్ష్యమైనా చూపగలరా?

ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. అన్ని రకాలుగానూ అన్ని విభాగాలలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన అయిదేళ్ల పాటు సాగితే రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనే విశ్వాసం ప్రజలలో కలుగుతోంది. ఇలాంటి పరిస్థితిని చూసి ఓర్వలేక పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద చల్లారని తపన పడుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిందించే ఏ ఒక్క అవకాశం కూడా వారికి లభించడం లేదు. కొన్ని కుటిలమార్గాలను ఆశ్రయిస్తోంది.

ఏదీ చేతగాక ఇప్పుడు కొత్తగా పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ కొత్త పాట ప్రారంభించారు. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతుందని దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. డ్యామ్ ఎత్తు తగ్గితే నిల్వ సామర్థ్యం తగ్గుతుందనేది ప్రత్యేకంగా వీరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎత్తు తగ్గించడానికి కుట్ర జరిగిందనే ప్రచారం కూడా అప్పట్లో ప్రబలంగా వినిపించింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు మీద వారు అదే నింద వేస్తున్నారు. కేంద్రం మాటకు తలొగ్గారని అంటున్నారు. అది కూడా నిజం కాదని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్నారు.


‘తగ్గించలేదు మొర్రో అని సాక్షాత్తు నీటి వనరుల మంత్రిగా చెబుతుండగా.. ఒక సాక్ష్యం కూడా చూపించలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళాలు మాత్రం తమ శైలిలో బురదచల్లి ఆనందిస్తున్నారు.వారి వైఖరి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో- ఏదీ మాట్లాడలేక దేనినీ విమర్శించలేని తప్పు పట్టలేని అసహాయ స్థితిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి పోలవరం ఎత్తు తగ్గింపు టాపిక్ ఎత్తుకున్నారు- అనే మాట వినిపిస్తోంది. అందుకే ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నట్లుగా కనీసం ఒక్క ఆధారమైన చూపించండి అని మంత్రి నిమ్మల రామానాయుడు సవాలు చేస్తుంటే వారు ఎవ్వరు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories