ఇలాంటి దృశ్యం అయిదేళ్లలో చూడగలిగామా?

రాష్ట్రానికి పెద్దగా, రాష్ట్ర ప్రజలకు పెద్దదిక్కుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ధార్మిక కార్యక్రమాలకు సకుటుంబంగా వెళ్లడం ఒక సాంప్రదాయం. సకుటుంబంగా అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోయినప్పటికీ.. సపత్నీకంగా వెళ్లడం వారి విధి. కొన్ని ధార్మిక కార్యక్రమాలను ప్రభుత్వాధినేత సపత్నీకంగా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల ఏలుబడిలో ఇలాంటి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేసిన వెంటనే.. తిరుమలేశుని దర్శనార్థం వెళ్లారు. ‘సకుటుంబంగా వెళ్లారు. దర్శనం తరువాత.. వేదపండితులు రంగనాయకమండపంలో వారి కుటుంబాన్ని ఆశీర్వదించినప్పటి చిత్రం ఇది.

ఈ చిత్రం చూస్తోంటే.. ధార్మిక విషయాలపై అవగాహన ఉన్నవారు, సాంప్రదాయం ఎరిగిన వారికి చాలా సంతోషం కలుగుతుంది. గత అయిదేళ్లలో ఇలాంటి చిత్రాన్ని ఒక్కసారైనా చూడగలిగామా అనే బాధ కూడా కలుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత.. ప్రతిసారీ తిరుమల బ్రహ్మోత్సవాలుకు ముఖ్యమంత్రిగా స్వామివారికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించడానికి తానే వచ్చేవారు. కానీ ప్రతిసారీ ఆయన ఒంటరిగా మాత్రమే వచ్చేవారు. భార్యాసమేతంగా వచ్చిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. ఇది సాంప్రదాయ విరుద్ధం అని తెలిసినా ఆయన రాలేదు.

జగన్ క్రిస్టియానిటీ మతం అనుసరిస్తారు. అది తప్పేం కాదు. అలాగని ఆయనకు నమ్మకం లేకపోతే.. తిరుమల ఆలయానికి రావాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక క్రిస్టియనుగా తిరుమల ఆలయానికి రావాలంటే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఆ సంతకం ఎగ్గొట్టడానికి తాను హిందూత్వం పుచ్చుకున్నట్టుగా ఆయన భ్రమపెట్టేవారు. తిరునామం పెట్టించుకునేవారు. కానీ.. ఆయన భార్య అయిదేళ్లలో తిరుమలలో అడుగు పెట్టలేదు. ఉగాది లాంటి పండుగల సమయంలో.. చెవిరెడ్డి లాంటి వందిమాగధులు ఆయన ఇంటి వాకిట్లో దేవుడి సెటింగ్ వేయిస్తే.. జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు పాల్గొనేవారు. ఆయన తిరుమల రావాల్సిన అవసరం లేదు. తన సొంత క్రిస్టియన్ మతం మీద పూర్తి విశ్వాసం ఉంచుకుని, హిందువు అయిన ఒక మంత్రి ద్వారా.. తిరుమల ఆలయానికి వస్త్రాలు పంపినా సరిపోయేది. అలా చేసేవారు కాదు. అందుకే .. చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల ఆలయంలో కనిపించిన ఫోటోను చూసి.. ‘ఆహా రాష్ట్రాధినేత భార్యాసమేతంగా దేవుడిని సేవించుకున్న దృశ్యం చూసి ఎన్నాళ్లయిందో కదా’ అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories