జగన్ పాలనలో ఇది ఊహించగలమా?

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. అన్నీ కాకపోయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం మరియు పండుగల వేళ ప్రజల ఉత్సాహాన్ని ఇనుమడింపజేసే ఉద్దేశంతో రెండు నిత్యావసర సరుకులను తక్కువ ధరకే తామే అందుబాటులోకి తెస్తున్నది. దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో కందిపప్పు, చక్కెర మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు అందించే ఏర్పాటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తున్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతూ ఉన్నట్లయితే ఇలాంటి విషయాన్ని అసలు ఊహించగలమా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సంక్షేమ పథకాల ముసుగులో అనేకానేక అనుచితమైన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలుసు. నెలనెలా ప్రజలకు డబ్బులు పంచడం అనే ఒకే ఒక్క పని ద్వారా పేద వర్గాలలో తనకు చెక్కుచెదరని బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవచ్చు అని జగన్ భ్రమపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని మొత్తం పణంగా పెట్టి పేదలకు కేవలం బిస్కెట్లు వేయడం ద్వారా, తాను కొన్ని దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉండగలనని ఆయన ఊహించుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను పడకేయించడం మాత్రమే కాకుండా నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడం ఆ రకంగా ప్రజల జీవితాలు అగచాట్ల పాలు కాకుండా ప్రభుత్వాధినేతగా శ్రద్ధ పెట్టడం అనేది జగన్ ఆలోచనలో లేని విషయాలు! ఒకవైపు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల జేబుల్లో డబ్బు పెడుతూ.. మరొకవైపు విపరీతంగా పెంచేసిన లిక్కర్ ధరలు ఏమాత్రం అదుపు లేకుండా పోయిన నిత్యావసర సరుకులు ధరలు.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అవమానకరమైన రీతిలో హెచ్చు ధరకు లభ్యమయ్యే పెట్రోలు ధరలు తదితరాలతో ప్రజలను దోచుకోవడం తప్ప జగన్ సర్కారు చేసిందేమీ లేదు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలను కూడా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నది. కందిపప్పు, చక్కెరలను కూడా తక్కువ ధరకు ప్రజలకు అందించడం అనేది కచ్చితంగా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజలు ఇలాంటి ప్రభుత్వానికి నీరాజనం పట్టుకుండా ఉండడం అసలు సాధ్యమా అని అంతా అనుకుంటున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించడం లాంటి పనులను జగన్ ప్రభుత్వ హయాంలో అసలు ఊహించడం కూడా సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories