వాళ్లను ముసుగులు వేసుకుని విచారించాలేమో!

రఘురామక్రిష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అరెస్టు చేసి తీవ్రంగా కొట్టి హింసించిన తీరుకు సంబంధించి నమోదైన కేసు.. ఒక పట్టాన తెమిలేలా కనిపించడం లేదు. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరు అయిన  అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్ కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉంటూ.. బెయిలు వచ్చే అవకాశం కూడా లేదని తేలిపోయిన తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి అరెస్టునుంచి రక్షణపొందిన తర్వాతే పోలీసు విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నలకు వేటికీ సరైన జవాబులు చెప్పకుండా దాటవేస్తున్నారు. అంతకు మించిన ట్విస్టు ఏమిటంటే.. ఆ రిటైర్డు అధికారిని ప్రశ్నలు అడగడానికి దర్యాప్తు అధికారులు కూడా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ఒక్క కేసు కాదు.. జగన్ ప్రభుత్వపు దుర్మార్గాలమీద నమోదైన ఏ కేసుల్లోనైనా విచారణ సవ్యంగా ముందుకు సాగుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

రఘురామ క్రిష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. జగన్ ప్రభుత్వం తన మీద కేసు పెట్టినప్పుడు పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించి హత్యాప్రయత్నం చేశారని కేసు పెట్టారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు, విజయపాల్ లను నిందితులుగా చేర్చారు. వీరిలో విజయపాల్ ను విచారిస్తుండగా ఎలాంటి వివరాలు బయటకు రావడం లేదు. కొన్ని ప్రశ్నలకు మీకెందుకు చెప్పాలి.. వంటి జవాబులు వచ్చాయి. ఆయన నోరు విప్పకపోతే అసలు కేసు ముందుకు వెళ్లడమే సాధ్యం కాదని అధికారులు భావించారు. ఈ కేసు విషయంలో.. పోలీసు ఉన్నతాధికారులు కొందరు జోక్యం చేసుకుని.. ఇప్పుడు విచారణ చేస్తున్న అధికారులతో మాట్లాడి హెచ్చరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ భక్త సీనియర్ల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో.. విచారణ చేస్తున్న వారు భవిష్యత్తులో ఏమవుతుందో ఏమో అనే భయంతో గట్టిగా అడగలేకపోతున్నారు.
తాజాగా ఈ కేసు దర్యాప్తు అధికారిగా గుంటూరు అడ్మిషన్ ఎఎస్పీ రమణమూర్తిని తప్పించి.. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు బాధ్యతలు అప్పగించారు.

విచారణాధికారులు ప్రశ్నలు అడగడానికే  భయపడుతుండడం అనేది చాలా పెద్ద విషయంగా పరిగణించాల్సి వస్తోంది. జగన్ భక్తులైన పెద్ద ఐపీఎస్ లు జోక్యం చేసుకోవచ్చు గాక.. కానీ ఇలా భయపడితే ఏ కేసూ తేలదు గాక తేలదు. రిటైరైన విజయపాల్ ను అడగడానికే ధైర్యం లేని వారు.. ఇతర కేసుల్లో విశాల్ గున్నీ, కాంతిరాణా తాతా, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారిని ఎలా విచారించగలరు? అనేది సందేహం. ఇప్పుడున్న పోలీసు అధికారుల మీద కూడా జగన్ భక్తుల ప్రభావం చాలా ఉంటున్నదేమో అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories