పవన్ ప్రశ్నకు పోలీసులు జవాబు చెప్పగలరా?

వైసీపీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆగంతకుడు గులకరాయి విసిరిన వ్యవహారానికి సంబంధించి.. పోలీసుల పాత్రపైనే సందేహాలు పెరుగుతున్నాయి. అంటే, పోలీసులే రాయి వేయించారని కాదు గానీ, పోలీసుల అసమర్థత వల్లే ఇలాంటి ఘటన జరిగిందనే అభిప్రాయం ఎక్కువమందిలో వినిపిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ దిశగా చాలా సూటిగా ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా చెబుతున్న మాటలు కూడా పవన్ సందేహాలకు ఊతమిచ్చేవిధంగానే ఉంటున్నాయి.

ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను పవన్ కల్యాణ్ సంధించారు. ‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా.. సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారు. అవన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? బాధ్యుతలైన అధికారులను బదిలీచేసి.. సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగించాలి. అప్పుడే భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటి? తదితర విషయాలు వెలుగులోకి వస్తాయి? రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికలసభల్లో నరేంద్రమోడీ పాల్గొన్నప్పుడే భద్రతపరమైన లోపాలు బయటపడ్డాయి. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు పారదర్శకంగా ఎలా నిర్వహించగలం? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి దృష్టి పెట్టాలి.?’ అని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.

అసలు జగన్ మీద రాయి విసరబడిన దుర్ఘటనలకు బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే.. నిజాలు ఎలా బయటకు వస్తాయని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీసు కమిషనర్, జగన్ సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని పవన్ ఎక్స్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

ఆయన ఆరోపణలకు తగ్గట్టుగానే.. కమిషనర్ కాంతిరాణా టాటా కూడా మాట్లాడుతున్నారు. సీఎం బస్సుపైకి ఎక్కి మాట్లాడే అవకాశం ఉన్నది గనుక.. ఆ వీధిలో వైర్లు కత్తిరించి విద్యుత్తు సరఫరా నిలిపివేశామని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తోంటే.. రాత్రి వేళ విద్యుత్తు వైర్లు కట్ చేసి, చీకటిమయం చేసేసి భద్రత కల్పించామని భ్రమపడడం చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాంతిరాణా టాటా ఇస్తున్న వివరణే .. పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories