పాపం ఐపీఎస్‌లు.. అరెస్టులు తప్పించుకోగలరా?

కీలకంగా ముగ్గురు ఐపీఎస్ లు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఇద్దరు మాకు ముందస్తు బెయిలు  కావాలంటూ కోర్టు గడప తొక్కారు. ఈ కేసును విచారిస్తూ.. వీరి కంటె పైఅధికారి అయిన సదరు మూడో ఐపీఎస్ అధికారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని.. కోర్టు అడిగినదంటే ఏమిటి అర్థం? నిందితులైన ఈ ఇద్దరు ఐపీఎస్ లకు కూడా ముందస్తు బెయిలు దక్కడం అనేది భ్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ముంబాయి నటి కాదంబరి జెత్వానీ ని అరాచకంగా అరెస్టు చేసిన కేసులో.. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ లు కటకటాలు లెక్కించవలసిన రోజు దగ్గర్లోనే ఉన్నదని పలువురు అంటున్నారు.
కాదంబరి జెత్వానీ కేసులో నిందితులైన ఐపీఎస్ లు కాంతిరానా తాతా, విశాల్ గున్నీల ముందస్తు బెయిలు పిటిషన్ పై హైకోర్టులో విచారణలు సాగాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం అసలు వీరిని అరెస్టుకు పురమాయించిన సీనియర్ ఐపీఎస్ అప్పటి నిఘావిభాగాధిపతి రెండో నిందితుడుగా ఉన్న సీతారామాంజనేయులు ను ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించింది. ఆయన ఇప్పటిదాకా ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేసిన దాఖలా కూడా లేకపోవడంతో అసలు దేశంలో ఉన్నారా? వెళ్లిపోయారా? అనే అనుమానం కూడా హైకోర్టు వ్యక్తం చేసింది.

జిందాల్ పై కాదంబరి జెత్వానీ ముంబాయిలో పెట్టిన కేసు విషయంలో ఆమెను బెదిరించి కేసు వెనక్కు తీసుకునేలా చేసుకునేందుకు.. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కేంద్రంగా పెద్ద కుట్ర నడిచిందనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో ఆమె మీద విజయవాడలో ఫోర్జరీ కేసు పెట్టించారు. దానిని అడ్డు పెట్టుకుని పోలీసులు ముంబాయి వెళ్లి ఆఘమేఘాల మీద ఆమె కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించి.. జిందాల్ పై కేసు వెనక్కు తీసుకోవాల్సిందిగా హింసించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాదంబరి జెత్వానీ విజయవాడ వచ్చి అప్పట్లో తనను వేధించిన పోలీసులపై కేసు పెట్టడంతో వ్యవహారం మొత్తం బయటకు వస్తోంది. జిందాల్ ప్రీత్యర్థం జగన్ ఆఫీసు నుంచే ఈ వ్యవహారం నడిపించినట్టుగా తేలింది. అడ్డంగా బుక్కయిన ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. కేసునుంచి బయటపడడానికి ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories