సీ-ఓటర్, నెట్‌వర్క్ తేల్చేశారు: జగన్ ఇక ఇంటికే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఘనవిజయం సాధించబోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేల్లో నిర్దిష్టమైన ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ సీ-వోటర్ – ఏబీపీ ఛానెల్ మరియు నెట్‌వర్క్ 18 సంస్థ సర్వేల్లో ఇదే విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఈ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఏపీలో విపక్ష కూటమికి తిరుగులేని, స్పష్టమైన మెజారిటీ కనిపించింది. కాకపోతే సీవోటర్ సర్వేలో కూటమికి 20, నెట్‌వర్క్ 18 సర్వేలో 18 స్థానాలు దక్కబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దళం 5 , 7 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఫలితాలతో పోల్చి చూసుకుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించబోతున్నట్టే. జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికి పరిమితం కావాల్సిందేనని ప్రజల నాడి చెబుతోంది.

తెలంగాణలో మాత్రం ఈ రెండు సంస్థల సర్వే అంచనాల్లో వ్యత్యాసం కాస్త ఎక్కువగా ఉంది. సీఓటర్ సర్వేలో 10 కాంగ్రెస్ కు, 4 బీజేపీకి, బీఆర్ఎస్ కు 2, మజ్లిస్ కు 1 దక్కుతున్నాయి. అదే నెట్‌వర్క్ 18 సర్వేలో మాత్రం బిజెపిది పైచేయిగా ఉంది. ఆ పార్టీకి 8 దక్కుతున్నాయి. మిగిలిన 9 సీట్లనే కాంగ్రెస్ సహా అందరూ పంచుకోవాల్సిన పరిస్థితి.

ఏపీలో సర్వేల విషయంలో కూడా రకరకాల మాయాజాలం నడుస్తూనే ఉన్నది. ఇలాంటి మైండ్ గేమ్ వ్యూహాల్లో ఆరితేరిన జగన్ దళాలు కొన్ని పెయిడ్ సర్వేలు చేయిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్  గెలవబోతున్నట్టుగా సాక్షి పత్రికలో, చానెల్లో ప్రచురించుకుంటున్నారు. అయితే అవేవీ కూడా ప్రామాణికత ఉన్న సర్వే సంస్థలు కాకపోవడంతో ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.

సీఓటర్ అనేది కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సందర్భంలోనూ వివిధ దశల్లో సర్వేలు నిర్వహిస్తూ ప్రజల నాడిని అధ్యయనంచేస్తున్న సంస్థ. 80 శాతం వరకు ఫలితాలకు దగ్గరగా ఉండే అంచనాలను అందిస్తున్న సంస్థ. దశాబ్దాల రెప్యుటేషన్ ఆ సంస్థకు ఉంది. సీఓటర్ సంస్థతో జాతీయ టీవీ ఛానెల్ ఏబీపీ కలిసి ఈ సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించింది. జగన్ కు అత్యంత దారుణమైన ఫలితాలు వచ్చాయి.

నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయాన్ని ముందుగానే ఊహించారని, అందుకే అభ్యర్థుల మార్పు పేరుతో రకరకాల పాట్లు పడుతున్నారని ఒక ప్రచారం ఉంది. పైగా ఏపీలో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుబంధంలోకి వచ్చిన తరువాత.. విపక్ష కూటమి మరింత స్ట్రాంగ్ అయినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత జగన్ ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని ప్రజలు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories