గేమ్‌ ఛేంజర్‌ కు రామ్‌ చరణ్‌ బై బై!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు శంకర్‌ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా సార్లు బ్రేకులు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.

కమల్ హాసన్ ఇండియన్ 2  సినిమా మధ్యలో రావడంతో డైరెక్టర్ శంకర్ కి రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గేమ్ ఛేంజర్  సినిమాను విడుదల చేయడం ఆలస్యమైంది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాడట. మరో పదిరోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కానుందట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది. మరో పదిరోజుల్లో ఇది కంప్లీట్ చేసి గుమ్మడికాయ తిప్పేయనున్నారు. అనంతరం మిగతా కార్యక్రామాలు కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా సినిమాని విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మరోవైపు చరణ్ తన నెక్స్ట్ మూవీ RC 16 ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. వచ్చే నెల నుంచే ‘ఆర్సీ16 ’ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories