బైబై డీజీపీ : పోలీసు అరాచకాలు తగ్గాలి యిక!

ప్రభుత్వ శాఖల్లో ఎవరెవరు తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం పనిచేసినప్పటికీ.. పోలీసు శాఖలో పరిస్థితి అలా ఉండదు. ఆ శాఖ మొత్తం ‘యెస్ బాస్’ అనే సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తుంది. పై అధికారి చెప్పిందే కింది వారికి వేదం. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను వారెవ్వరూ పట్టించుకోరు. బాసు చెప్పిన ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం.. విచ్చలవిడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారంటే.. అందుకు ప్రధాన కారణం.. ఆ శాఖను శాసిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

జగన్ కు వీరభక్తుడిగా పేరు గడించిన రాజేంద్రనాధ్ర రెడ్డి ఆదేశాల మేరకే.. రాష్ట్రంలోని సమస్త పోలీసులూ  వైసీపీ కార్యకర్తల్లాగానే మారిపోయారు. వీరి అరాచకాల పోకడలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఎన్నెన్ని ఫిర్యాదులు చేశాయో లెక్కలేదు. ఈసీ స్పందించడంలేదు.. అనే ఆవేదన కూడా వ్యక్తం అవుతూ వచ్చింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కాదు కదా.. వారికి అనుకూలంగా పోలీసు అరాచకాలు శృతిమించుతూ వచ్చాయి. దీంతో ఈసీలో కదలిక వచ్చి ఎట్టకేలకు.. డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేరసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల్లోకా సీనియర్ ఐపీఎస్ అధికారుల్లోముగ్గురి పేర్లతో ప్యానెల్ పంపాల్సిందిగా సీఎస్ ను ఈసీ ఆదేశించింది.
జగన్ కు వీరభక్తుడిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రనాథ్ రెడ్డి ని డీజీపీ  విధులనుంచి పక్కకు తప్పించడం పట్ల ప్రతిపక్షాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం అతిపెద్ద షాక్ అని చెప్పాలి. పోలీసుల సహకారంతో పోలింగ్ నాడు.. విధ్వంసం సృష్టించడం, భయాందోళనలు రేకెత్తించడం ద్వారా.. పోలింగ్ తక్కువ నమోదయ్యేలా చేసి అనుచిత మార్గాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ ప్లాన్ చేసినట్టుగా పుకార్లు వచ్చాయి. అయితే డీజీపీ బదిలీతో వారికి షాక్ తగిలినట్టే. కొత్త డీజీపీ సారథ్యంలో..నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం, ఆశ పలువురిలో వ్యక్తం అవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories