బుట్టబొమ్మ బాయ్‌ ఫ్రెండ్‌ ఇతడేనా!

తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుగుమ్మ పూజాహెగ్డే గురించి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు కూడా టాలీవుడ్‌ లో క్షణం తీరిక లేకుండా గడిపిన హీరోయిన్‌. తెలుగుతో పాటు, హిందీ, తమిళ చిత్రాల్లో కూడా తన హవా చూపించింది.

అయితే గత కొంత కాలంగా  పూజా  క్రేజ్ బాగా తగ్గింది. రీసెంట్ గా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్ గా చేయాల్సిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని కారణాల చేత సినిమా నుంచి పక్కకు జరిగింది.  ఆ తర్వాత కాలం కలిసి రాక తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఏడాది క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటించింది.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టింది. తాజాగా  బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ. సాజిద్ న‌డియాడ్ వాలా బ్యాన‌ర్ లో అహ‌న్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘సంకీ’ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.

 అయితే తాజాగా పూజాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. దీంతో పూజ తో పాటు ఉన్న వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.గతంలో రోహన్ మెహ్రా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్‌ తారా సుతారియాతో రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories