బుట్టా నయా దందా.. వైసీపీ వారికి ఆదర్శం అవుతుందా?

ఆమె మాజీ ఎంపీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి.. తరువాత తెలుగుదేశంలో చేరారు. !ఈ పార్టీకి తనకు సాపత్యం కుదరదని ఆమెకు అర్థమైంది. తన మార్కు రాజకీయానికి వైఎస్సార్ కాంగ్రెస్  మాత్రమే కరెక్టు అని తెలుసుకుంది. తిరిగి సొంత గూటికి చేరుకుంది. పార్టీ ఆమెకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు గానీ.. అక్కడే ఉండి రాజకీయం చేసుకుంటున్నది. తాజాగా ఆమె సాగిస్తున్న దందా ఒకటి అడ్డదారులను ఆశ్రయించాలని అనుకునే వారికి ఆదర్శంగా మారే అవకాశం కనిపిస్తోంది. బయటకు కనిపించే నేరం ఏమీ లేదు. తప్పు చేయలేదు. కానీ భారీగా లాభపడ్డారు. అంతా పద్ధతిగా జరిగితే ఆస్తుల్ని కొంత కోల్పోవాలి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు అనే రాజకీయ అండ కవచంలా నిలుస్తోంది. ఈ నయా దందా షురూ చేసిన ఆమె కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కాగా.. ఆమె ఎల్ఐసీ హౌసింగ్ వారినుంచి రుణం తీసుకుని వారిని ఆరడి పెడుతున్న వైనం ఇప్పుడు వార్తలోకి వస్తోంది.

బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిపి తమ ఆస్తులు కొన్నింటిని తనఖా పెట్టి.. బెంగుళూరు లోని ఎల్ఐసీ హౌసింగ్ వారినుంచి 310 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు.  ఇంచుమించుగా నెలకు మూడుకోట్ల రూపాయలకు పైగా ఇన్ స్టాల్ మెంట్ కట్టాల్సి ఉంటుంది. కొంకాలం బాగానే కట్టారు. తర్వాత..  మొహం చాటేయడం ప్రారంభించారు. అలా దాదాపు అయిదేళ్లపాటు అసలు కంతులే కట్టలేదు. కట్టిన డబ్బులు పోగా.. ఇంకా దాదాపు 340 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టుగా లెక్కతేలింది. ఈ సొమ్ము చెల్లింపుల కోసం ఒత్తిడి పెడితే.. ఆచరణ సాధ్యం కాని బేరాలతో వారు రుణం ఇచ్చిన సంస్థనే ముప్పు తిప్పలు పెట్టారు. ఆ సంస్థ విసిగిపోయి.. వారు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయడానికి హైదరాబాదు బంజారా హిల్స్ లో ఓ అయిదువేల గజాలు, మాధాపూర్ లో బుట్టా కన్వెన్షన్ ఉన్న చోట మరో ఏడున్నర వేల గజాల స్థలాల్ని వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వేలంలో ఆ స్థలాలను తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

వాస్తవంగా రుణం ఇచ్చిన సంస్థ ప్రతిపాదిస్తున్నంత విలువ ఆ స్థలాలకు లేదు అనేది ఒక వాదన కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నాయకులు కావడం వలన వారి ఆస్తులను వేలంలో కొనుక్కుంటే ముందు ముందు ఎలాంటి చికాకులు సృష్టిస్తారో అనే భయం వేలంలో పాల్గనే వారిని వెనక్కు జంకేలా చేస్తోంది. వందల కోట్లు పెట్టి వేలం పాడి.. రోడ్డున పోయే సమస్యల్ని తెచ్చి నెత్తిన వేసుకోవాలా? మనకెందుకొచ్చిన గొడవ అని వారు అనుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ నాయకులకు ఈ బుట్టా రేణుక బాట రోల్ మాడల్ అయ్యేలా ఉంది. ఆస్తులను తనఖా పెట్టి.. ఏదో ఒక మాయ చేసి వాటి విలువను మించిన రుణం తెచ్చుకోవడం.. వేలం దాకా వస్తే పాట పాడే వారిని బెదిరించడం వంటి మార్గాలు వారికి అనుసరణీయాలు అయితే ఆశ్చర్యం లేదని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories