పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఓజి’. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ ఎగ్జైట్మెంట్ ఏర్పడింది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రావడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిందని కానీ, మొదటి విడుదల పోస్టర్స్, ట్రైలర్లలో తెలుగు, తమిళ్, హిందీ అని స్పష్టంగా చూపించలేదు. దీని కారణంగా అభిమానుల్లో మొదటగా సినిమా కేవలం తెలుగు భాషలోనే రాబోతుందనే భావన ఏర్పడింది. అయితే తాజాగా రిలీజ్ అయిన హిందీ ట్రైలర్ ఈ సినిమా హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యే విషయం ధృవపరిచింది.
ఇక మిగతా భాషల్లో రిలీజ్ వివరాల కోసం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.