పార్టీ ముసుగులో దందాలు.. ఎన్నికల్లో పైసా విదిల్చరు!

మద్యం కుంభకోణం విచారణ చురుగ్గా సాగుతుండడంతో అనేకానేక విస్తుగొలిపే విషయలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 3500 కోట్ల రూపాయలలో గరిష్టంగా బిగ్ బాస్ గా వ్యవహారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అందినట్టుగా అన్ని వార్తలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తొలినుంచి కొత్త మద్యం పాలసీ రూపకల్పన దగ్గరినుంచి, తాను చేసిన ప్రతి పని కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చేసినట్టుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. ఈ వసూళ్ల దందాకు పార్టీ ఫండ్ కోసం అనే ముసుగు తొడిగారు. పార్టీ2 ఫండ్ అంటే ఏమిటి..? పార్టీ అవసరాల కోసం, ఎన్నికలు వచ్చినప్పుడు.. అభ్యర్థులకు తలాకొంత ఆర్థికసాయం అందించడానికి వాడడమే కదా! మరి.. ఎంతో క్లిష్టంగా అత్యంత ఎక్కువ ఖర్చుతో కూడినవిగా జరిగిన 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఆస్తులు అమ్ముకున్నారే తప్ప.. పార్టీ నుంచి పైసా కూడా విదిలించలేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు పార్టీకి భారీగా ఫండ్ సేకరించడం అనే ప్రచారం చేసుకుంటూ వేల కోట్ల రూపాలయ అవినీతికి పాల్పడి.. ఆ సొమ్మును పూర్తిగా జగన్ ఒక్కడే దాచుకోవడం, పార్టీకోసం పైగా కూడా ఖర్చు పెట్టకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.

మద్యం కుంభకోణం విషయంలో వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీకి చెందిన నాయకుల్లోనే విపరీతమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను నమ్మి, ఆయన వెంటనడుస్తూ ఉంటే.. తమను వంచించాడనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది. రకరకాల కార్పొరేషన్ల పేరు చెప్పి వందల వేల కోట్ల రూపాయల రుణాలు పుట్టించి.. ఆ సొమ్ములన్నింటినీ తన ఇష్టారాజ్యంగా వాడుకున్నట్టుగానే.. పార్టీ ఫండ్ కోసం భారీగా డబ్బులు అవసరం అంటూ.. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. పార్టీ గెలవడానికి డబ్బుకు ఇబ్బంది పడుతున్న నేతలకు ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం కుంభకోణంలో వెల్లడవుతున్న వాస్తవాల వలన.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసులోకి వస్తారా? తనకు కొమ్ముకాసిన, గులాంగిరీ చేసిన అధికారులు కొందరితోపాటు.. ఆయన కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందా? అనే ప్రశ్నలు తర్వాత.. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు మాత్రం పార్టీ నాయకుల దృష్టిలో మంటగలిసిపోతోంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న విధానాన్ని రద్దుచేసేసి.. కొత్త విధానానికి రూపకల్పన చేయడం దగ్గరినుంచీ.. పార్టీకోసం భారీగా ఫండ్ వచ్చేలా విధానం ఉండాలని అందరినీ పురమాయించి.. దందాలకు అనుకూలంగా ఆ పాలసీని చేయించిన జగన్మోహన్ రెడ్డి.. మరి వసూలు చేసిన 3500 కోట్లో పార్టీకోసం ఎంత ఖర్చు పెట్టారు? ఏయే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం ఎంత ఇచ్చారు? ఆయన ఆర్థికంగా అండదండగా నిలిచి ఉంటే ఇవాళ ఓడిపోయే పరిస్థితే ఉండేది కాదు కదా.. అనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories