బిజినెస్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా చెంతకు బుజ్జి!

జాతీయ స్థాయిలో సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ని జూన్‌ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తుండ‌గా, నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్ గా రూపొందించాడు. ఇప్ప‌టికే విడుదల అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై అంచ‌నాల‌ను వేరే లెవల్‌ కి తీసుకుని వెళ్లాయి.

ఇక ఈ సినిమాలో సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్ తో వావ్ అనిపించేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మైన‌ట్లుగా క‌ల్కి ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా బుజ్జి రోబోటిక్ కారు ఈ సినిమాలో కీల‌కం కానుండ‌టంతో అందరి చూపు ఆ కారుపైనే పడింది. తాజాగా ఈ కారును చూసి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ ఆనంద్ మ‌హీంద్రా కూడా ఎంతగానో ఫిదా అయ్యారు.

‘క‌ల్కి’ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బుజ్జి కారును దేశ‌వ్యాప్తంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు మేక‌ర్స్. ఈ క్ర‌మంలోనే ఆనంద్  తాజాగా బుజ్జి ని నిశితంగా ప‌రిశీలించి, దాన్ని డ్రైవ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మేక‌ర్స్  సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories