బన్నీ అరెస్ట్‌..నాని ట్వీట్‌!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ కావడంతో, ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ పరిణామంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన విషాదకరమని.. అయితే, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదని పలువురు ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు.

 అయితే, బన్నీ అరెస్ట్‌పై పలువురు సెలెబ్రిటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఈ ఘటనకు ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని బన్నీకి తన సపోర్ట్‌ను తెలియజేశాడు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా బన్నీ అరెస్ట్‌పై స్పందించాడు. ‘సినిమా పరిశ్రమకు చెందిన వారి విషయంలో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపిస్తున్న ఆసక్తి సామాన్యుల విషయంలోనూ చూపిస్తే బాగుంటుంది. ఆరోజు జరిగిన ఘటన విషాదకరం.. అలా జరగాలని ఎవరూ అనుకోరు.

ఆ ప్రమాదం నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఈ ఘటనకు అందరూ బాధ్యులే. ఈ ప్రమాదం ఒక్క వ్యక్తి వల్ల జరిగింది అయితే కాదు.’ అని నాని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories