స్టార్ హీరో అల్లు అర్జున్ కు పెద్ద రిలీఫ్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బన్నీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విషయంలో హై కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో అల్లు అర్జున్ తరఫు లాయర్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై వాదనలు విన్న కోర్టు శుక్రవారం అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది.
రూ.50 వేల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు అయినట్లు సమాచారం. అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు కావడంపై అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.