ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి AA22×A6 అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పై షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవల అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంట్రొడక్షన్ సీన్‌ను గ్రాండ్‌గా చిత్రీకరించినట్టు సమాచారం.
ఇక తాజా టాక్ ప్రకారం, ఈ సినిమాకు హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో ఆసక్తి చూపుతోందట. సన్ పిక్చర్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించేందుకు ఆ స్టూడియో చర్చలు జరుపుతోందని వినిపిస్తోంది. అయితే ఏ స్టూడియో అనేది మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. ప్రస్తుతం ఆ చర్చలు మొదటి దశలోనే ఉన్నాయట.
ఇంకా ఒక కీలక విషయం ఏమిటంటే, ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యుఎస్‌ఏలోని ఒక క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీని సిద్ధం చేసే ప్రయత్నం జరుగుతోందట.