బన్నీ…మరోసారి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు చేసిన భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ తో పాన్ ఇండియా లెవెల్లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే తన నుంచి అనేక సినిమాలకి ఎంతో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ గా లుక్ పరంగా బన్నీ చాలా ప్రయోగాలు చేసాడు. ఇలా పుష్ప 2 కి కూడా ఒక డీ గ్లామర్ లుక్ లో ఫిజికల్ గా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యి మంచి ట్రీట్ అందించాడు.

ఇలా నటన పరంగా మన స్టార్స్ లో బన్నీ ఎంతవరకు అయినా వెళ్తాడు. అయితే ఇపుడు తన నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ ఒక ప్రయోగాత్మక లుక్ ని బన్నీ సిద్ధం చేస్తున్నట్టుగా మైత్రి నిర్మాత రవి శంకర్ రివీల్ చేశారు. బన్నీ నెక్స్ట్ సినిమాలో లుక్ ఊహించని లెవెల్లో ఉంటుంది అని ఇపుడు బన్నీ ఆ లుక్ ప్రిపేర్ చేసే పనుల్లో ఉన్నారు అంటూ క్రేజీ అప్డేట్ అందించారు. ఆ లుక్ లో బన్నీ అందరికీ షాకిస్తాడు అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు బన్నీ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories