బుద్ధా కోరిక తీరదు గానీ.. టీడీపీ హ్యాపీ!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ఎన్నికల పర్వం పూర్తయిన తర్వాత పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఒక బలమైన కోరికను వ్యక్తం చేశారు! తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నదని ముందే ఆశాభావం వ్యక్తం చేసిన బుద్ధ వెంకన్న, చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తానికైతే, అమరావతి కేంద్రం గా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారో అదే ముహూర్తానికి మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను నారా లోకేష్ చేతిలో పెట్టాలని ఆయన ఆశించారు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరబోతుందా లేదా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు.. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను బుద్ధా వెంకన్న చెప్పినట్టుగా లోకేష్ చేతిలో పెట్టడం బాగానే ఉంటుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. నారా లోకేష్ .. పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకువచ్చారని.. ఆయన చేతిలోనే సారథ్యం ఉండడం అవసరం అని పలువురు భావిస్తూ వచ్చారు. పార్టీ నిర్వహణలో అనేక నూతన సంస్కరణలు కూడా లోకేష్ తీసుకువచ్చారు. ఈసారి మూడు పార్టీలకు మంత్రి పదవులు పంచాల్సి ఉన్నందున లోకేష్ ను కేవలం పార్టీ బాధ్యతలకు మాత్రమే పరిమితం చేసి, ప్రభుత్వాన్ని చంద్రబాబు నడపాలని అనుకున్నారు.

రెండు రోజుల కిందటి వరకు చంద్రబాబునాయుడు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేవలం పార్టీ బాధ్యతల్లో ఉండడం వలన, నారా లోకేష్ ను ప్రభుత్వ కీలక నిర్ణయాలలో భాగస్వామిగా మార్చడం కుదరదు అనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించినట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆయన కీలక శాఖ దక్కుతుందని అంటున్నారు. అయితే మంత్రి పదవితో పాటు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారా? లేదా, కేవలం మంత్రిగా ఉంచి పార్టీ అధ్యక్ష పదవి మార్పిడిపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటారా? అనేది మాత్రం తెలియడం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories