అన్నయ్య వర్సెస్ తమ్ముడు! టాలీవుడ్ మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లలో ఒకరు ఫుల్ లెంగ్త్ సినిమాల్లో బిజీగా ఉంటే మరొకరు సినిమాలు అలాగే పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్స్ నటించిన అవైటెద్క్ సినిమాలు రిలీజ్ కి ఇపుడు సిద్ధంగా ఉన్నాయి. అవే పవన్ నటించిన “హరిహర వీరమల్లు” అలాగే చిరు నటించిన “విశ్వంభర”. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఈపాటికే విడుదల కావాల్సినవి కానీ అలా ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇక వీరమల్లు సినిమా ఆల్రెడీ మార్చ్ 28కి రిలీజ్ అని అంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పటికి కష్టమే అని కూడా వినిపిస్తుంది. మరో పక్క అన్నయ్య చిరు విశ్వంభర ని మేకర్స్ మే రిలీజ్ కి అనుకుంటున్నారనీ బజ్ ఉంది. అయితే ఇపుడు ఇదే మే నెలకి తమ్ముడు హరిహర వీరమల్లు కూడా షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే వీటిపై ఒక సాలిడ్ క్లారిటీ రావాల్సిందే అని చెప్పాలి.