జగన్ పై అదారిపోయిన బ్రహ్మాజీ కౌంటర్!

ఆ ట్వీట్ తనది కాదని ఆయన మరొక ట్వీట్ చేసేసి చేతులు దులుపుకున్నారు గానీ.. ఈలోగా సినీనటుడు బ్రహ్మాజీ చేసిన వెటకారం.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత డేమేజీ చేయగలదో అంతా చేసేసింది. జగన్మోహన్ రెడ్డి.. తూతూమంత్రంగా రెండు సార్లు వరద ప్రాంతాల్లో పర్యటించేసి.. యూకే వెళ్లిపోవడానికి పాస్ పోర్టు గొడవ అడ్డం రావడంతో.. ప్రస్తుతానికి సేద తీరడానికి బెంగుళూరు యలహంక ప్యాలెస్ వెళ్లి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటూ.. ఇక్కడ జరుగుతున్న సహాయక పనుల మీద ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రజల్లో చులకన పాలవుతోంది. అలాంటి జగన్ విమర్శలకు నటుడు బ్రహ్మాజీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్ సంచలనం అయింది. కొద్ది సేపటి తర్వాత.. అది నేను చేసిన ట్వీట్ కాదని, తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆయన చెప్పి ఊరుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి.. ఏదో తాను కూడా ప్రజలకోసం పరితపిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆయన బెంగుళూరులో కూర్చుని పెట్టిన పోస్టు మీదనే చాలా విమర్శలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో మీకు కనిపించడం లేదా అంటే నెటిజన్లు ఒక రేంజిలో జగన్ ను ఆడుకున్నారు. మీ అయిదేళ్ల నిర్వాకం ఫలితమే కదా ఇది.. అంటూ కూడా విమర్శించారు.

అయితే సినీనటుడు బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేశారు. ‘‘మీరు కరెక్ట్ సార్. వాళ్లు చెయ్యలేరు. ఇక నుంచి మనం చేద్దాం. ఫస్ట్ మనం రూ. వెయ్యి కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసిచూపిద్దాం.. జై జగనన్నా’’ అంటూ పోస్టు పెట్టారు.

వైసీపీ నుంచి ఇప్పటిదాకా పార్టీ కోటిరూపాయల విరాళం ప్రకటించడం మాత్రమే జరిగింది. నాయకులుగానీ, ఆ పార్టీలోని బడా పారిశ్రామికవేత్తలు గానీ.. ఏమాత్రం సాయం ప్రకటించలేదు. ఈ వైఖరే చాలా విమర్శల పాలవుతోంది. దానికి తగ్గట్టుకు బ్రహ్మాజీ పెట్టిన పోస్టు.. జగన్ వైఖరిమీద బాగా వెటకారంగా ఉన్నదని పలువురు అంటున్నారు. ఈ ట్వీట్ వైరల్ అయి సంచలనం గా మారడంతో.. బ్రహ్మాజీ తన అకౌంట్ హాక్ అయిందని, ఎవరో పెట్టారని ప్రకటించారు. అలా చెబుతూ మరో ట్వీట్ పెట్టారు గానీ.. పాత ట్వీట్ ను మాత్రం తొలగించలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories